సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, మంగళవారం ఉదయం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. జగన్.. తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సుమారు 60 మంది పైగా వైసీపీ ప్రజా ప్రతినిధులు పైగా హస్తినకు వెళ్లారు. మూడ్రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు జగన్. ఏపీలో అధికార టీడీపీ నేతలు తమ వైసీపీ క్యాడర్ ఫై దాడులు, హత్యలు చేస్తున్నారని కేంద్రానికి, దేశానికీ తెలియపర్చడానికి , ప్రధాని మోడీ తో భేటీ కావడానికి వారు ఢిల్లీ వేదికగా చేసుకొన్నారు. తమపై ఏపీలో దాడులకు నిరసనగా రేపు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్‌ ధర్నా చేయనున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు.. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు. బధవారం ధర్నా తర్వాత.. ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు. అసలే తక్కువ మెజారిటీ తో కేంద్రములో నెగ్గుకువస్తున్న ఎన్డీయే సర్కార్.. జగన్ చేపట్టబోయే ధర్నా కు కీలకమైన ఇండియా కూటమి నేతలు కనుక మద్దతు తెలిపితే దేశరాజకీయాలలో మరో అరుదయిన మలుపు కు తెరలేచె అవకాశం స్వష్టంగా ఉంది. మరి ప్రధాని మోడీ కి ఏపీలోని అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరు కావలసినవారే.. ఒకరికి 16 మంది ఎంపీలు అయితే మరొకరి పార్టీకి 15 మంది ఎంపీలు ఒకరు లోక్ సభ లో మోడీ సర్కార్ నిలబెడితే మరొకరు రాజ్యసభలో బలంలేని ఎన్డీయే గట్టెకించి కేంద్ర నిర్ణయాలు చట్టాలు కావడంలో సహకరిస్తున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటన భవిషత్తు రాజకీయాలకు బాటలు వేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *