సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా చెల్లించని కారణంగా తాము త్వరలో ఆ సేవలు నిలిపివేస్తామని ప్రవేటు ఆసుపత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో అధికార టీడీపీ నేతలు అది గత వైసీపీ చేసిన తప్పుగా ప్రకటించడం ఫై ..మరో ప్రక్క టీడీపీ కేంద్ర మంత్రి ప్రకటనతో సరికొత్త చర్చ మొదలైంది. వైఎస్సార్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని మాజీమంత్రి విడదల రజిని ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని అనడం సరికాదన్నారు రజిని. గతంలో మేము కూడా 2014 నుండి 2019 వరకు చంద్రబాబు సర్కార్ పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను తాము క్లియర్ చేశామన్నారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, బకాయిల పేరుతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి వైదొలుగుతుందా? అన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. విడదల రజినీ కామెంట్లకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో గతంలో అనేక ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయని గుర్తుచేశారు. మరో ప్రక్క ఏపీ ప్రజలు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ ఈ కార్డుల ద్వారా .. ఆరోగ్యశ్రీ తరహాలోనే అయిదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చ రాజుకొంది. ఆరోగ్యశ్రీ స్థానంలో కేంద్రము ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్.. రాష్ట్రంలోకి తెస్తున్నారని పెమ్మసాని కామెంట్స్‌ రుజువు అయ్యిందని వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా రుసరుస లాడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *