సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల పంపిణి నేడు, గురువారం భీమవరం నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ఈ ఆగస్టు నెల మొదటి పింఛన్ కల్లు గీత కార్మికునికి అందజేసి ప్రారంభించారు. పట్టణంలో పలు వార్డులలో వృధాప్య పింఛను 4వేలు చప్పున వికలాంగ పింఛను లు 6వేలు రూపాయలు చప్పున సచివాలయ ఉద్యోగులు లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి అందిస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. నేటి సాయంత్రానికి దాదాపు 90 శాతం పైగా పూర్తీ అయినట్లు సమాచారం. మిగిలిన కొద్దీ శాతం రేపటి లోగ పింఛను లు అందుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారి పింఛన్ బకాయిలు వచ్చే నెలలో కలిపి ఇవ్వలేరు.
