సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొనే భక్తులు హుండీ లో కానుకలు డబ్బు రూపంలో చెల్లిస్తే మరికొంతమంది బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా ఇలా రకరకాల వస్తువులు స్వామివారి హుండీలో వేస్తుంటారు.అయితే వాటిని వేలం వేసేందుకు టీటీడీ తాజాగా నేడు, శనివారం నిర్ణయం తీసుకుంది. కానుకలు సొంతం చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. అయితే కానులు ఏంటి, ఎప్పుడు వేలం నిర్వహిస్తారు, వేలంలో ఏఏ వస్తువులు పెట్టనున్నారో తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరో విషయం ఏంటంటే వేలాన్ని ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనవచ్చు.. భక్తులు స్వామివారికి సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28న వేలం వేయనున్నారు. అలాగే కాపర్-2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను ఆగస్టు 30, 31వ తేదీల్లో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఆగస్టు 30న కాపర్- 2 రేకులు 3వేల కేజీలను 15లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. అలాగే ఆగస్టు 31న సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు 2,400 కేజీలను12లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు. వేలంలో పాల్గొనేవారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *