సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమ లో అది, లక్ష్మి, చెన్నకేశవ రెడ్డి , దిల్ , అదుర్స్ , ఠాగూర్ వంటి భారీ బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అందించిన ఒకనాటి అగ్ర దర్శకుడు, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ సానుభూతి పరుడు వివి వినాయక్ కి అనారోగ్య రీత్యా ఆయన గత 10 రోజులుగా హాస్పటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నారు..తాజాగా ఆయనకు ఒక మేజర్ లివర్ సర్జరీ జరిగినట్లు ప్రస్తుతం పూర్తీ విశ్రాంతి తీసుకొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎల్బీనగర్ లో ఉన్న కామినేని హాస్పిటల్స్ లో బెడ్ రెస్ట్ లో ఉన్నారు. మంచి మనిషి వినాయక్ త్వరగా కోలుకోవాలని ఆయన శ్రేయాభిలాషులు కోరుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *