సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయం లో నేడు,గురువారం సమీక్ష నిర్వహించారు. ఇక సాంకేతిక రంగం భవిషత్తు ఫై ఉంటుంది కాబ్బటి ఆర్టిఫిషియల్ ఇం టిలిజెన్స్ స్పురణకు వచ్చే లా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు. అమరావతి రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మా ర్గం గా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పు డు మళ్లీ రాజధాని పనులు వేగంగా పునరుద్ధరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవడం తదితర అంశాలపై చర్చించారు.
