సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైనటువంటి విజయవాడ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల వరద బాధితులకు ఆదుకోవడానికి భీమవరం లోని స్వచ్చంద సంస్థలు , విద్య సంస్థలు, మెడికల్ సంఘాలు నడుంకట్టాయి. ఈ నేపథ్యంలో గత సాయంత్రం నుండి భీమవరం మునిసిపల్ కార్యాలయంలో మున్సిపల్ , సచివాలయ సిబ్బంది కలసి వంటలు చేసి విజయవాడ వరద బాధితులకు వేలాది పులిహారా పొట్లాల ప్యాకింగ్ తయారు చేసి పంపించారు. భీమవరం నుండి అనేక మెడిసిన్స్ కూడా వెళ్లాయి. ఈనేపథ్యంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ & డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్, తరపున టీచర్లు, విద్యార్థులు కలసి తయారు చేసిన వెజ్ బిర్యాని 10 వేలు పాకెట్స్ నిన్న సాయంత్రం విజయవాడ పంపగా నేడు, మంగళవారం వారి తరఫున ఈరోజు 5,000 ఆహార పొట్లాలను, 10,800 రస్కుల్ ప్యాకెట్లను మరియు 4,500 రష్యన్ బన్ ప్యాకెట్లను అందించినట్లు డైరెక్టర్ – స్టూడెంట్స్ అఫైర్స్ & ఆడ్మినిస్ట్రేషన్, డాక్టర్ పి. శ్రీనివాస రాజు తెలియజేశారు. కలెక్టర్ నాగరాణి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (అడ్మిన్), జె. ప్రసాద రాజు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఎమ్. రమేష్ రాజు, ఫార్మసీ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాఘవ రాజు, కళాశాల సిబ్బంది స్టూడెంట్ వాలంటీర్లు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *