సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. అల్పపీడనం ఉత్తర దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు ,భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.పశ్చిమ గోదావరి జిల్లాకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోతలదాచుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *