సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం రోజులుగా విజయవాడ వాసులకు కంటికి కునుకు లేకుండా చేసిన బుడమేరు కు 3 గండ్లు ఆర్మీ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం పూడ్చినప్పటికీ తాజగా నేడు, ఆదివారం విజయవాడ వాసులను మళ్లీ బుడమేరు భయపెడుతోంది..! నిన్నటి సాయంత్రం నుండి విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. నేడు ఉదయం మరింత ఉధృతమైంది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు థాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గండ్లను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి.. నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *