సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో అధిక వర్షాలు విజయవాడ లో వరదలులో చిక్కుకున్న ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని, ఆపదలో ఉన్న వారికి సహాయపడేందుకు దాతలు భారీ విరాళాలు అందించడం అభినందనీయమన్నారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2 లక్షల 50 వేలు జనసేన నాయకులు వేగేశ్న శివరామరాజు, చింతలపాటి బంగార్రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి అందించారు. నిరంతరం కురుస్తున్న వర్షాలతో విజయవాడలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సత్యనారాయణ రాజు (ఉనికిలి), నడింపల్లి లక్ష్మీపతిరాజు, ఎస్ ఎస్ రావు, కందుల అరవింద్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *