సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీ,అనిల్03. వీరి ఇరువురి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 3వ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాత గా వెంకటేష్ హీరోగా (ఓరి దేవుడా తో సహా) సీతమ్మ వాకిట్లో మొదలు అన్ని సినిమాలు విజయాలు మంచి లాభాలు సాధించడం ఓ విశేషం.. ఈ సినిమా లాంగ్ షెడ్యూ ల్ ముగిసింది. 30+ రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో, ప్రధాన తారాగణం , పాటలు మరియు యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా, సెట్‌లోని ఉల్లాసమైన వాతావరణాన్ని చూపిస్తూ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకీ మామ సందడే సందడి..స్పెషల్ వీడియో విడుదల చేసారు. ఇది బాగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మేకింగ్ వీడియోలో, వెంకటేష్ సంప్రదాయ దుస్తులలో కళ్లద్దాలతో కనిపిస్తుండగా, ఐశ్వ ర్య రాజేష్, అతని భార్య భాగ్యపాత్రలో, క్లాసిక్ చీరను ధరించింది. వెంకీ మామ మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి, ట్రెండింగ్ లుక్ లో కనిపిస్తుంది.సరదాగా సాగిన వీడియో చివరలో చిత్ర టైటిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం ’ అని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *