సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని విధంగా ఏపీలో వరదలు భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే అనధికారికంగా గల్లంతు అయిన వారి సంఖ్యా ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక పంట పొలాలు , చేపల రొయ్యల చెరువుల ముంపు తో వచ్చిన నష్టం అంతు లేనిది. దాని లెక్క ఇంకా తేలలేదు. అయితే 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 200 ఎకరాల్లో సెరీకల్చర్‌కు నష్టం జరిగింది. ఆవులు,గేదెలు 420,, గొర్రెలు ఇతర పశువులు 62 వేల 424 కోళ్లు చనిపోయాయని అన్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజీని లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రహదారులు డ్యామేజీ అవగా.. 4,203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బతిన్నాయి. పంచాయతీల పరిధిలో 1,160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్లు డ్యామేజీ అయ్యాయి. 540 పశువులు మృత్యువాత పడ్డాయి. 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు కిలో మీటర్ల మేర దెబ్బతిన్నాయి. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1,668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ వరదలకు దెబ్బతిన్నాయి. బుడమేరు, తమ్మిలేరు, కొల్లేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు, చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *