సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని వైద్య విద్యార్థులకు కేంద్రం తీపికబురు చెప్పింది.. కొత్తగా 2 వైద్య కళాశాలలో కోర్సులు ప్రారంభించడానికి అనుమతి వచ్చింది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలో గత ఏడాది ఏకంగా ఐదు కొత్త వైద్య కాలేజీలకు కేంద్రం నుండి అనుమతి రావడంతో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మరో రెండు కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ రెండు కాలేజీల ఏర్పాటుతో మరికొన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మాజీ సీఎం జగన్ స్వంత నియోజకవర్గం కడప జిల్లాలో పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి.. ప్రస్తుతానికి 50 ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతులు ఇచ్చింది. కొసమెరుపు ఏమిటంటే ఈ కాలేజీ ని ఈ ఏడాది మర్చి 11 నే అప్పటి సీఎం హోదాలో జగన్ ప్రారంభించడం గమనార్హం. ( ఫై ఫోటో ) అటు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా ఎన్‌ఎంసీ అండర్‌టేకింగ్ లేకుండానే ఈ కాలేజీలకు ఎల్‌ఓపీ మంజూరు చేశారు.
