సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారుల సౌకర్యార్థం 4 బెంచ్ లు ఏర్పాటు చేశారు. 3వ అదనపు జిల్లా కోర్టు కేసుల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన బెంచ్ కు న్యాయమూర్తిగా పోక్సో కోర్టు స్పెషల్ న్యాయమూర్తి గౌరవ M.A. సోమశేఖర్ పాల్గొన్నారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు కేసులు మరియు బ్యాంకు, BSNL ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన బెంచ్ కు న్యాయమూర్తిగా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గౌరవ B. అప్పల స్వామిపాల్గొన్నారు. మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను రాజీ చేసారు. గత శనివారం జాతీయ లోక్ అదాలత్ లో 14 సివిల్ కేసులు, 4 మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు, 110 క్రిమినల్ కేసులు, 25 బ్యాంకు, BSNL ప్రీ లిటిగేషన్ కేసులు 153 కేసులు రాజీ అయినాయి. రాజీ విలువ సుమారు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు. ఆకివీడు కు సంబంధించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు కు చెందిన ఒక చీటింగ్ కేసు లో రాజీ చేసి ముద్దాయి నుండి ఫిర్యాదు కు 1,56,000 ఇప్పించి రాజి చెయ్యడం జరిగింది.
