సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేలం పాటలో ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయలు పలికింది. లడ్డూ వేలం పాట అంటే వెంటనే గుర్తొచ్చేది బాలాపూర్ గణేశ్ లడ్డూనే. ఈ సారి రికార్డు స్థాయిలో 30 లక్షలు పలికింది. కానీ, ఇప్పుడు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.ఈసారి హైదరాబాద్ కు సమీపంలో .. ఏకంగా ఓ గణపయ్య లడ్డూ ప్రసాదం ఏకంగా కోటి 87 లక్షల రూపాయల ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఈ రికార్డ్ నమోదైంది. దీంతో గణేశుడి లడ్డూ ధర రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.ఇది అల్ టైం ఆల్ ఇండియా రికార్డు గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది అని తెలిసి అందరు నివ్వెరపోయారు. శ్రీ గణేష్ లడ్డునా .. మజాకానా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *