సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు సెన్సేషనల్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ సినిమా కోసం.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రూపుదిద్దుకుంటోన్న తాజా క్రేజీ ప్రాజెక్టు సినిమా. ఇటీవల పొల్లాచ్చిలో నెలరోజులు పైగా భారీ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో . ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో కొత్తషెడ్యూల్‌ ప్రారంభించుకుంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సెట్స్‌‌లోకి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథి వచ్చి అందరినీ .వెంకీఅనిల్3 సెట్స్‌‌లో సందడి చేశారు. సినిమా సంగతులు తెలుసుకొన్నారు. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో ఇటీవల మంచి సినిమా ‘భగవంత్ కేసరి’ని రూపొందించారు. ఈ మూవీ ఇటీవల SIIMAలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం వెంకీమామ సెట్స్‌లో బాలయ్య ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *