సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పర్వదినం నేపథ్యంలో భీమవరంలో నేటి గురువారం ఉదయం నుండి ఆలయాలు ముఖ్యంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిట లడాయి. అయితే ఈసారి బాణాసంచా వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగలేదనే చెప్పాలి. ధరలు కూడా ఎక్కువ కావడం , అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో ప్రజలకు తగినంత ఆదాయం లేకపోవడం వల్ల బాణసంచా తో పాటు పూజాసామాగ్రి, పువ్వుల వ్యాపారం, మిఠాయి వ్యాపారం కూడా గతం తో పోలిస్తే చాల తక్కువ స్థాయిలో జరుగుతుంది. నూనెలు ధరలు కూడా భారీ భారీగా పెరిగిపోవడంతో నేటి రాత్రి కూడా దీపాల పండుగ ఫై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.నేటి ఉదయం నుండి వ్యాపారస్తులు, జైనులు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడ స్థిరపడినవారు వారి ఆచారాలను అనుసరించి ‘లక్ష్మి’ పండుగ మొదలు పెట్టారు. భీమవరంలో ధన త్రయోదశి నుంచి జ్ఞానపంచమి వరకు వేడుకలు నిర్వహిస్తారు. జైనుల పుణ్యక్షేత్రం సుందరమైన పాలరాతి దేవాలయం పెదమిరంలో వేడుకలు స్వయం భువుడు శ్రీ ఆదినాధ్ గురువుకు ప్రత్యక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు , ప్రజలు అందరు తగిన జాగ్రత్తలతో ఎటువంటి ప్రమాదాలు లేకుండా దీపావళి పండుగ చక్కగా జరుపుకోవాలని చీకట్లు తొలగించే దీపం వెలుగులతో శ్రీలక్ష్మి దేవి అస్సిసులు పొందాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘సిగ్మా న్యూస్’ వీక్షకులందరికి శుభాకాంక్షలు తో మీ .. సిగ్మా ప్రసాద్..
