సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పర్వదినం నేపథ్యంలో నూతన సంవత్ 2083ను స్వాగతిస్తూ నేడు ఆదివారం దేశీయ స్టాక్ మార్కెట్ నిర్వహిస్తున్న ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేటి మధ్యాహ్నం 2.20 నుంచి 3.30 వరకూ నేడు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 397 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 81,425.92 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ కూడా ఏకంగా 493 పాయింట్లు ఎగబాకి 25,030 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, ఇండిగో మినహా మిగిలిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.ఈ రోజు స్టాక్స్ కొనుగోలుతో ఏడాదంతా సానుకూల పరిస్థితులు ఉంటాయని మదుపర్లు విశ్వసిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *