సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ. మొగల్తూరు– బంటుమిల్లు మీదుగా మచిలీపట్నం వరకు చేపట్టే కొత్త రైల్వేలైన్‌కు అయ్యే ఖర్చు, భూసేకరణ, ప్రయాణికుల రద్దీ, ఇతర రూట్లలోని మార్గాలతో అనుసంధానం తదితర అంశాలపై రైల్వే చేసిన ప్రాథమిక సర్వే నివేదిక మరో 2వారాలలో ఢిల్లీలోని రైల్వే బోర్డుకు వెళ్లుతుందన్నారు. తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతి వస్తుందని మంత్రి చెప్పారు నరసాపురం నుండి భీమవరం మీదుగా వారణాసి ( కాశీ )వరకు ప్రత్యేక రైలు ప్రతిపాదన అమలు చెయ్యాలని ఇటీవల రైల్వే మంత్రిని కోరినట్లు శ్రీనివాసవర్మ చెప్పారు. ఇది కాకుండా చెన్నై విజయవాడల మధ్య నడుస్తున్న వందే భారత్ భీమవరం వరకు పొడిగిస్తామని ఇటీవల వచ్చిన ఆటంకాలు తొలగి మరో 3 నెలలలో ఇది ప్రారంభం అవుతుందన్నారు. నరసాపురం నుంచి ప్రతి ఆదివారం హైద్రాబాద్‌కు నడుస్తున్న స్పెషల్, వీక్లి బెంగుళూరు స్పెషల్‌ను కూడా రెగ్యూలర్ చేయాలని మంత్రిని కోరా మన్నారు. కోటిపల్లి నుండి నర్సాపురం వరకు రైల్వేలైన్ పనులు గత వైసీపీ ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్రవాటాగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఇప్పటి వరకు రైల్వే ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇక దిగమర్రు నుంచి పామర్రు వరకు చేపట్టే 165 జాతీయ రహదారి పనుల్ని వేగవంతం చేస్తామన్నారు. భీమవరం, ఉండి రహదారిలో పెండింగ్ పడిన ప్లై ఓవర్ వంతెన పనుల్ని వచ్చే నెలలో మొదలు పెడతామని మంత్రి చెప్పారు
