సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర దర్యాప్తు స్టంస్త విచారణ జరిపించాలని మాజీ సీఎం జగన్ తాజగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన .. ఇటీవల రాష్ట్రంలో 100 పాలన ముగిసాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, పాలనలో అన్ని విధాలా విఫలమై ,రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసమర్ధుడు గా మిగిలిపోయిన చంద్రబాబు తన రాజకీయ స్వార్ధం కోసం జనం దృష్టిని మరలించడానికి తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ నీచమైన ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో నెయ్యి నాణ్యత లోపాలు గుర్తించి 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపమని తెలిపారు. 2014 లో చంద్రబాబు పాలన నుండి తిరుమల లో రికార్డ్స్ పరిశీలించాలని, అన్ని లెక్కలు తేల్చాలని తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కల్సిందా? లేదా ? వాస్తవాలను కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని, దోషులను తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలని జగన్ రాసిన లేఖలో ప్రస్తావించారు. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో టీడీడీ ప్రసాదాల క్వాలిటీ నిర్ధారణ బోర్డు లో సభ్యులు పని చేసిన పలువురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ లో కీలక పదవులలో, మంత్రిగా కొనసాగుతుండటం మరో విశేషం..అదికాక అప్పటి టీడీడీ బోర్డు లో కేంద్రములోని బీజేపీ కి చెందిన పెద్దల సిఫార్స్ తో హైందవ ప్రముఖులును సభ్యులుగా నియమించామని జగన్ స్వయంగా పేర్కొనడం విశేషం..
