సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండిలో స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదం రగులు కొంటున్న నేపథ్యంలో భీమవరంలో నేటి సోమవారం ఉదయం పెద్దఎత్తున దళిత నాయకులు మోటారు బైక్ లపై ర్యాలీ నిర్వహించి రఘురామా ఫై నిరసన నినాదాలు చేస్తూ అంబెడ్కర్ చౌక్ లోని విగ్రహం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. దీనిలో స్థానిక దళిత నేతలు తో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ… అంబే డ్కర్ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపైౖ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రఘురామా వైఖరి గతం నుండి దళితులపై అహంకారంతో అవమానకరంగానే ఉంటుందని రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ తాజాగా జరిగిన సంఘటన ఫై క్షమాపణ చెప్పి అంబెడ్కర్ ను ఇటు దళితుల ను అవమానించిన రఘురామా ఫై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.దళిత సంఘాల ధర్నాతో భీమవరం ప్రధాన సెంటర్ ల లో కొద్దీ సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ఎటువంటి ఉద్రిక్తలు కు తావులేకుండా సమన్వయంతో వ్యవహరించారు.
