సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ్ వైద్యకళాశాల నుంచి మొత్తం 14మంది విద్యార్థులు టెంపో ట్రావెల్‌ను మాట్లాడుకునిగత శనివారం రాత్రి బయలుదేరారు. అలా పకృతి సోయగాలు చూస్తూ అల్లూరి సీతారామరాజు నిన్న ఆదివారం మారేడుమిల్లికి వచ్చారు. వారంతా గత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జలతరంగిణి జలపాతం వద్ద స్నానాలు చేస్తున్నారు. ఎగువప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ఈ సమయంలోఫొటోలు తీసేవారు బురద నీరు వస్తోందని కేకలు వేస్తున్నారు. క్షణాల్లోనే నీరు పెరిగిపోతుండగా వెంటనే కొంతమంది తప్పించుకోగా అక్కడ ఐదుగురు కిందకు జారిపోయి కొట్టుకుపోయారు. అయితే వారిలో ఇద్దరినీ వారి స్నేహితులు స్థానిక అగ్నిమాపక సిబ్బంది రక్షించగా ముగ్గురి ఆచూకీ నేడు, సోమవారం ఉదయానికి తెలియక వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి చదివి డాక్టర్స్ కావలసిన వారి భవిషత్తు ఇలా కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. గల్లంతయిన అయిదు గురిలో గాయత్రి ప్రియ, చింతా హర్షిణిలను రక్షించారు. మిగిలిన ముగ్గురు విద్యార్థులు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన చింతకుంట హరదీప్(20), విజయనగరం జిల్లాకు చెందిన కొసిరెడ్డి సౌమ్య(21), విజయనగరం జిల్లాకు బాలి అమృత (22) కాలువలోకి కొట్టుకుపోయారు.
