సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డూ వివాదం కేసు ను సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని సిట్ ద్వారా విచారణ చేయించడానికి నిర్ణయించినప్పటికీ దానికి అంగీకరించని వైసీపీ అధినేత, జగన్ ప్రధాని మోడీ కి కేంద్ర దర్యాప్తు చెయ్యాలని లేఖ రాయడం.. తదుపరి వైసీపీ నేత, మాజీ టీడీపీ బోర్డు చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి మరియు, సీఎం చంద్రబాబు లడ్లు పేరుతొ మహిమానిత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రతిష్ట దెబ్బ తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రఖ్యాత లాయర్ సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్ట్ కు వెళ్లి మరో పిటిషన్ లు దాఖలు చెయ్యడంతో .. లడ్డు వివాదంలో అసలు వాస్తవాలు తేల్చేందుకు ఆ 2 పిటిషన్ లపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్ విచారణకు నిర్ణయించింది. లడ్డూ కేసు విచారణ జస్టిస్, బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్లను బెంచ్ కు కేటాయించింది. కాజ్ లిస్టులో ఐటెం నెంబర్ 63గా తిరుమల లడ్డూ కేసు లిస్ట్ అయ్యింది. ఎల్లుండి, అంటే సోమవారం సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు విచారణ ప్రారంభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *