సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నేడు, బుధవారం మాజీ మంత్రి కేటీఆర్ నుద్దేశిస్తూ అక్కినేని నాగార్జున కుటుంబం మీద, రకుల్ ప్రీత్ సింగ్ మీద సంచలన వ్యాక్యలు చేసారు.అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. రకుల్ ప్రీత్ సింగ్ అంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆరే .. ఆమెకు డ్రగ్స్ అలవాటు చేసాడు. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అలాగే సినీ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటు. కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? రేవ్ పార్టీలు చేసుకొన్నా హీరోయిన్స్ ని బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేసారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. N కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత నా దగ్గరకు రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడు. నాగార్జున నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ (KTR) దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. సమంత ఒప్పుకోలేదు. కేటీఆర్ దగ్గరకి వెళ్ళకపోతే మా ఇంట్లో ఉంటే ఉండు.. లేకపోతే వెళ్ళిపో అన్నారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుంది.అని కొండా సురేఖతీవ్ర ఆరోపణలు చేసారు. విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. బీఆర్ఎస్ లో నేను ఐదేళ్లు పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. వాళ్ళు నాపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్ పోస్టులు పెడుతున్నారు’’ అని సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
