సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, గురువారం దసరా వేడుకల ప్రారంభ నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రీ అమ్మవారికి శ్రీ సువర్ణ రజిత అలంకారం నిర్వహించారు. భక్తులు విశేషంగా హాజరు అయ్యి శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. దసరా శోభా యాత్రను చిన్నారుల దేవి వేషాలతో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి హైదరాబాద్ కి చెందిన మన్నే శ్రీనివాసరావు 6 గ్రాముల బంగారం కానుకగా అందచేసినారు వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం అందించడం జరిగింది. అందజేశారు. ఈ దసరా వేడుకలలో గతంలో కన్నా ఒక మెట్టు ఎక్కువ స్థాయిలో దేవాలయంలో పుష్ప అలంకరణలు ఆలయ ఆవరణలో సంక్రాంతి వార్షికోత్సవాలు తలపించే తరహాలో పందిళ్లు లైటింగ్ ఏర్పాట్లు, ప్రతి సాయంత్రం నుండి రాత్రి వరకుఉత్సవ వేదికపై ఆధ్యాతిక , సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చెయ్యడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *