సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు, శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇప్పటికే . కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.
