సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డు వివాదంపై సుప్రీం కోర్ట్ నేడు, శుక్రవారం ఉదయం కీలక తీర్పు వెలువరచింది. లడ్డు లో కల్తీ ఫై చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ విచారణ కు బదులుగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ , సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరపాల్సిందిగా కోర్టుఆదేశించింది.( వైసీపీ అధినేత జగన్, సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కోరుకొన్నది ఇదే..) ఈ నిర్ణయం జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వ నాథన్ ధర్మాసనం అందిం చిన విచారణలో వెలువడింది, ఈ కేసు గురిం చి సుప్రీం కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సమీక్షించడం జరిగింది. సిట్ దర్యా ప్తు కొనసాగించాల లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలకు దర్యా ప్తును అప్పగించాలా? అనే అంశం పై అభిప్రాయం అడిగారు. .స్వతంత్ర దర్యాప్తు జరగడం మంచిదేనని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. దర్యాప్తు బృందంలో ఐదుగురు సభ్యులు ఉండాలని ఆయన సూచించారు, ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు, , ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని వారు వివరించారు. ఈ కేసు నేపథ్యంలో, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా కోర్టుకు హాజరయి తన పిటిషన్ ఫై వాదించడం విశేషం, ఈ తిరుపతి లడ్డు కల్తీ ఫై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన దరిమిలా జరిగిన పరిణామాలు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నందున, ఇకపై రాజకీయంగా ఎవరు పవిత్ర లడ్డు ప్రతిష్ట దెబ్బతినేలా వివాదాస్వాద ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యకూడదని కోర్ట్ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *