సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవాహ్నక సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ధ్వజారోహణానికి ముందుగా అంకురార్పణ కార్య క్రమాన్ని గత గురువారం రాత్రి శాస్త్రోక్తంగా జరిపారు. . ఈ రోజు శుక్రవారం సాయంత్రం 5:45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది, ఇది బ్రహ్మోత్స వాలు ప్రారంభమౌతాయి. రాత్రి నుంచి తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి వివిధ వాహనాల్లో ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 12వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయి. నేడు, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేటు వాహనాలు పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. టాక్సీలపై కొండపైకి వెళ్లే భక్తులు ఇది గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *