సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు నిజం కాకపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఫై హోరాహోరీ పోరులో వినేశ్ ఫోగట్ 6వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌లో ముందంజలో దూసుకుపోయారు. ఆ తరువాత రౌండ్లలో స్వల్పంగా వెనకపడ్డారు. మరల 8వ రౌండ్‌ నుంచి ఆధిక్యాన్ని కనబర్చారు.పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువుగా ఉన్నారనే కారణంగా ఆమె ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయారు. దీంతో బంగారం లేదా వెండి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు కేంద్రానికి వ్యతిరేకంగా రెజ్లర్ల ఉద్యమంలో ఫోగట్ కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలపై పై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు. హర్యానా ఎన్నికల వేళ మరో రెజ్లర్ భజరంగ్ పునియాతో కలిసి ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొత్తానికి ప్రజలు ఆమెను ఎమ్మెల్యే గా అక్కునచేర్చుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *