సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో ఉద్యోగులు విద్యార్థులు, భవాని మాలలు ధరించిన భక్తులు దూరప్రాంతాలకు దేవాలయాలకు వెళ్లే సందడి రద్దీ ని పురస్కరించుకుని విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు రెండు రైళ్ళను దక్షిణమధ్య రైల్వే ప్రకటించారు. 07215 విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్డుకు రాత్రి 8 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. నేటి బుధవారం 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఈ రైలు నడపనున్నారు. అదే విధంగా 07216 శ్రీకాకుళం రోడ్డు నుంచి విజయవాడకు ఉదయం 6.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు ఈనెల 10 నుంచి 18 వరకూ నడపనున్నారు. ఈ రెండు రైళ్ళు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, స్టేషన్లలో ఆగనుంది. ఈ రైళ్ళల్లో ఎసీ త్రి టైరు కోచ్‌లు, స్లీపరు క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
