సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి విజయవాడ వరద బాధితులకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వరద బాధితులకు సహాయార్ధం భీమవరం బార్ అసోసియేషన్ రూ 1,11,111 ల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్, వైస్ ప్రెసిడెంట్ కే వెంకటరావు, జనరల్ సెక్రటరీ అడపాల ప్రసన్న కుమార్, కే భాగ్యలక్ష్మి, కోశాధికారి సిహెచ్ పరలరావు, జాయింట్ సెక్రటరీ జే సత్యనారాయణ, కే ప్రతాప్, ఏం మల్లేష్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *