సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్నఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కూటమి పార్టీల అభ్యర్థి ని బరిలోకి దింపుతున్న నేపథ్యంలో ఓటర్లను నమోదు చేయించడంలో టీడీపీ తో పాటు కూటమి నేతలు ముందుండాలని మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్థానిక క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియే షన్‌ భవనంలో గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఓటు నమోదుపై అవగాహన సమావేశం నిర్వహించారు. సదస్సుకు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ పాల్గొన్నారు. పెద్ద చదువులు చదువుకున్నవారు ఎలానూ కూటమి పార్టీలనే బలపరుస్తారని, ఓటర్లు సంఖ్యా పెరిగేలా చూడాలని ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థికి అత్యధిక మెజార్టీ లభిస్తుందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున ఓట్ల నమోదును వేగవంతం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *