సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం స్దానిక దంతులూరి నారాయణరాజు (DNR )కళాశాలలో ఆధికవి నన్నయ్య యూనివర్సిటీ అంతర్ కళాశాలల మరియు యూనివర్సిటీ బ్యాడ్ మెంటెన్ (షటిల్) పురుషుల టీం సెలక్షన్స్ ఈ రోజు రేపు జరుగుతున్నాయని1 కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జి.మోజెస్ తెలిపారు. ఈ రోజు బుధవారం జరిగిన ప్రారంబోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) విచ్చేశిన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడాకారులందరూ ఔచ్చాహిక ప్రదర్సన కనపరచి మీ కళాశాలకు మరియు నన్నయ్య యూనివర్శికీ కీర్తి ప్రతీష్టలు తీసుకురావాలని కోరారు. డి.యన్.ఆర్. కళాశాలలో విద్యతో పాటు క్రీడలను కూడా మీము ప్రోత్సహిస్తున్నామని ఔత్సాహిక క్రీడాకారులకు ఫీజు రాయితీలు కల్పిస్తున్నామని తెల్పరు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ జి.పాండు రంగరాజు పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య జాయింట్ సెక్రటరీ కె.రామకృష్ణంరాజు ,పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బి.వి.నరసింహరాజు,అసిస్టేంట్ సెక్రటరీ కె.శివరామరాజు పాల్గొన్నారు. ఈ పోటీలలో ఉబయ గోదావరి జిల్లాలనుండి 20 టీంలు పాల్గొంటున్నాయి. ఇక్కడ సెలక్టు అయిన యూనిర్సీటి టీం ఈ నెల 26 తేదీ నుండి 29 తేదీ వరకూ యస్.ఆర్..యమ్. యూనివర్సిటీ , చేన్నై లో జరుగు సౌత్ జోన్ ఇంచర్ యూనివర్సిటీ టోర్నమెంటులో పాల్గొంటుందని తెలపారు.
