సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోవాయుగుండం తీరం దాటినప్పటికీ ఇంకా పలు ప్రాంతాలలో వర్షాలు కూరుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, శుక్రవారం కూడా చెదురుమదురుగా వర్షం పడుతూనే ఉంది. అలాగే మధ్య మధ్యలో ఎండకూడ తీక్షణం గా కాస్తుండటం విశేషము. నేడు కూడా విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా గంటల కొద్దీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు. అటు ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. మార్కాపురం మండలం బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తర్లుపాడు – మార్కాపురం మధ్య కొండ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. ఇటు నంద్యాలలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
