సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా మారి, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం కి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావంతో అక్టోబర్ 23 నుండి 25వరకు 40 కిమీ వేగంగా గాలులతో గోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశ ఉంది. అక్క డక్క డ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *