సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే దీపావళి పండగ సందర్భంగా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు పథకం ప్రారంభిస్తున్నట్లు నేడు, సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పండగ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పారు. దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారికి మాత్రమే దీపం పథకానికి అర్హులు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వాటిని అధికారులు పరిశీలించి అర్హత ఉందని భావిస్తే పధకం మంజూరు చేస్తారు. ప్రస్తుతం మాత్రం . ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు దీపం పథకం అమలవుతుంది.ఇందుకోసం ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది.
