సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం దర్శించుకున్న స్థానిక భక్తులు బి వీరేంద్రబాబు దేవి కృష్ణ ప్రభ దంపతులు (ఆదిత్య ఆక్వా వారు) 18, గ్రాముల 190 మిల్లిల. బంగారంను శ్రీ అమ్మవారికి కానుకగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ మూర్తి, , జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ప్రసాదాలు అంజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నేడు, సోమవారం ఉదయం దర్శించుకున్న సామర్లకోట కి చెందిన రామలక్ష్మణ మూర్తి సులోచన రాణి దంపతులు 4 గ్రాముల బంగారం ను శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం అందజేశారు.
