సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో విద్యార్థులు ప్రతి ఏటా క్యాస్ట్ (కుల ధ్రువీకరణ పత్రాల ) సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే పద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ రకాల బిల్లులు వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్ స్టా ఫ్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మెటా ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీకరించింది. మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని 1 జన్పథ్లో జరిగిన కార్యక్రమంలో తాజగా ఎంవోయూ చేసుకోవడం గమనార్హం.
