సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎక్కడ చుసిన డిజిటల్ అరెస్ట్ మోసాలు’ (Digital Arrest Scams) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అకౌంట్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలిస్తే సంబంధిత వ్యకికి ఫోన్ చేసి సీబీఐ లేదా ఈడీ నుంచి, లేదా పోలీసు అధికారులమంటూ నమ్మించి.. ఏదో ఒక నేరంలో ఇరుక్కుపోయినట్టు భ్రమ కల్పించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. మొన్న భీమవరంలో ఒక డాక్టర్ ను ఇదే తరహా మోసం చేసి సైబర్ నేరగాళ్లు టీమ్ 70 లక్షల రూపాయలు పైగా ఒక్క దెబ్బకు అవలీలగా దోచేశారు. డిజిటల్ ఇండియా.. దేవుడూ ఎరుగు .. డిజిటల్ దోపిడీలు మాత్రం అంతులేకుండా పెరిగిపోతున్నాయి. ఈ తరహా మోసాల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నిన్న (ఆదివారం) దేశ పౌరులకు అవగాహన కల్పించారు. 115వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ఈ స్కామ్‌లపై మాట్లాడారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిజిటల్ మోసాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2024 ఆరంభంలో తొలి నాలుగు నెలలు అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌ల కారణంగా నేరగాళ్లు మొత్తం రూ.120.3 కోట్లను దోచుకున్నారు. తొలి నాలుగు నెలల్లో దాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందాయని ఎన్‌సీఆర్‌పీ తెలిపింది. గతేడాది 2023లో మొత్తం 15.56 లక్షల ఫిర్యాదులు అందాయని, 2022లో ఈ సంఖ్య 9.66 లక్షలుగా, 2021లో 4.52 లక్షలుగా ఉన్నాయని పేర్కొంది.
