సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఆపదలో ఆదుకొని ప్రాణాలు కాపాడే కీలకమైన 108, 104, వాహనాల సిబ్బందిని ఉద్యోగులకు నిర్వహించిన అరబిందో సంస్థ ను ఆ సేవల నుండి తప్పిస్తూ తాజాగా చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీచేసింది. కొత్తగా టెండర్లు పిలచి మరో సంస్థకు ఆ బాధ్యతలు అందిస్తారని భావిస్తున్నారు. 108, 104, 102 ఈ మూడు పథకాల కింద వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత రెండు, మూడు నెలలుగా జీతాలు అందటం లేదు. వారికి వివిధ అలవెన్సుల కింద చెల్లించాల్సిన రూ.50 కోట్లను సైతం అరబిందో సంస్థ నిలిపివేసింది. దీంతో ఉద్యోగులంతా తమకు రావాల్సిన జీతం, అలవెన్సులు చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ సంస్థకు నిరసన నోటీసులు అందించారు.అయితే మారిన పరిస్థితులలో 108, 104సేవల నుంచి తాము తప్పుకుంటామని అరబిందో సంస్థ 40 రోజులు క్రితమే ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాసినట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *