సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర శాసనమం డలిలో నేడు, గురువారం వైసీపీ సబ్యులకు టీడీపీ మంత్రులకు తీవ్ర వాగ్వవాదం జరిగింది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిని రహస్య ప్రాంతాలలకు తరలించి హింస పెడుతూన్నారని ఆరోపిస్తూ దీనిపై నేడు సభలో చర్చ జరగాలని వైసీపీ సభ్యులు పట్టు పట్టారు. అయితే దీనిపై చర్చకు మండలి చైర్మెన్ మోషేను రాజు తిరస్కరించారు.దీంతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. అయినప్పటికీ మండలి చైర్మెన్ వైసీపీ సభ్యుల ఆందోళనలోనే సభను కొనసాగించారు. ఈ పరిస్థితి చూసి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సభ్యులు ప్రజల సమస్యలపై ప్రస్తావించాల్సింది పోయి.. ఆందోళన చేస్తారా? వైసీపీ సోషల్ మీడియా వారు కూటమి నేతలపైనే కాదు జగన్ తల్లి,చెల్లిని.. చదవలేని భాషలో తిడుతూ పోస్టులు పెడితే.. వారికి వత్తాసు పలుకుతారా? అని ప్రశ్నించారు.
