సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు గత శనివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని నేటి ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో స్వగ్రామం నారావారి పల్లెకు తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేశ్, కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. రామ్మూర్తి పార్థివ దేహాన్ని బంధువులు, స్థానికులు సందర్శనార్ధం ఉంచారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. మధ్యాహ్నం 3గంటలకు రామ్మూర్తి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు జరిగినచోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నారా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కుమారులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *