సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమింపబడిన వేగేశ్న సూర్యనారాయణ రాజు (కనకరాజు సూరి)ని నేడు, ఆదివారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కలిసి సత్కరించారు. జనసేన పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి కనకరాజు సూరి అని, నిబద్దతతో చిత్తశుద్ధితో ఎంతోకాలంగా బాధ్యతయుతంగా కృషి చేసారని, అటువంటి కనకరాజు సూరికి ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమింపబడటం గొప్ప విశేషమని, పదవులతో బాధ్యతలు మరింత పెరుగుతాయని అన్నారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి మాట్లాడుతూ ..తనకు ఈ బాధ్యతలను అందించిన ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, క్షత్రియ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అదే విధంగా క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన యారకరాజు సత్య వారిహరరాజు ను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *