సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం తాజగా భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచితంగా రేషన్ అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్.. వన్ రేషన్ అనే నినాదాన్ని తీసుకువచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా దీనికోసం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) ను డిజిటలైజేషన్ చేసింది.. అంతేకాకుండా ఈపీఓఎస్ యంత్రాలను కూడా సమకూర్చింది.. ఈ క్రమంలోనే 5.8కోట్ల నకిలీ రేషన్‌ కార్డులను తొలగించనట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది… డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా PDS వ్యవస్థలో నకిలీలను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమండిజిటైజేషన్‌ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని, తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే దిశానిర్దేశం చేసినట్లయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. పీడీఎస్ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తంగా 80.6కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా.. ఆధార్‌ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8కోట్ల నకిలీ రేషన్‌ కార్డులను తొలగించారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటివరకు 20.4కోట్ల రేషన్‌ కార్డుల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. బయోమెట్రిక్ ప్రమాణీకరణతో 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయినట్లు తెలిపింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *