సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన అదానీ కుంభకోణం ఫై ఒక ప్రక్క దేశంలో ‘ప్రధాని మోడీ మిత్రుడు అదానీ’ అంటూ అతనికి దేశాన్ని దోచి పెట్టుతున్నారని ఒకప్రక్క కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు ఎన్డీయే పాలనపై విరుచుకొని పడుతుంటే… దానికి బిన్నంగా దానిపై ఏపీలో ఎన్డీయే నేతృత్రం లోని చంద్రబాబు సారధ్యంలోని నేతలు అమెరికా రిపోర్ట్ లో అదానీ ఉదంతం లో జగన్ పేరు ప్రస్తావించడం?పై..నేడు, శుక్రవారం ఏపీ శాసనసభలో తీవ్ర స్థాయిలో మాజీ సీఎం జగన్ ఫై విరుచుకొని పడ్డారు. ఏపీలో (అదానీ పోర్టుల స్థాపనలో అతనితో కలసి జగన్.. )పదేపదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించారు. ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని అన్నారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము మాత్రం షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. . ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్ వేశారని..అందులో జగన్ పేరు ఉందన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అదానీ వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌కు రూ.1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు.
