సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని అన్ని అంబెడ్కర్ విగ్రహాల వద్ద, వివిధ విద్యాసంస్థలు ప్రభుత్వ సంస్థలలో డాక్టర్ అంబెడ్కర్ కు ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. భీమవరం పురపాలక సంఘ కార్యాలయములో నేడు, మంగళవారం ఉదయం 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం లో భాగం గా భీమవరం మునిసిపల్ ఉద్యోగులు అందరూ భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ అంబేద్కర్ గారి పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత జాతికి భవిషత్తు లో వచ్చే సమస్యలను సైతం ముందే గుర్తించి వాటి పరిష్కారాలు చూపుతూ ఆయన అందించిన రాజ్యాంగం లోని అపూర్వమైనదని వక్తలు పేర్కొన్నారు. అనంతరం సామూహిక పీఠిక ప్రతిజ్ఞ మరియు భారత రాజ్యాంగ గొప్పతనాన్ని తెలుపుతూ మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్ర రెడ్డి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *