సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం ఆవరణలో గత రాత్రి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ అమ్మవారి దీక్షాపరులు మరియు వందలాది మహిళలుచే లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కనివిని ఎరుగని అందమైన భారీ రంగు రంగు ముగ్గులు పుష్ప అలంకరణలు మధ్య కార్తీక దీపపు కాంతులతో, విభిన్న కళా కృతులతో ఆలయం ఆవరణ కార్తీక ఆధ్యాత్మిక శోభతో సందడిగా ఉంది. ఈ కార్యక్రమమని దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ , ఆలయ సిబ్బంది, ఆలయ సహయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షించారు. ఏది ఏమైనా ఈ కార్తీకమాసం పంచారామ సోమేశ్వరుని దేవాలయం కార్తీక శోభతో పోటీ పడుతూ శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం కూడా సరికొత్త శోభతో ప్రతి రోజు కళకళ లాడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *