సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ఘనంగా షష్ఠి వేడుకలు నిర్వహించే అత్తిలి పేరు రాష్ట్రంలో వినని వారు ఉండరు. తణుకు పట్టణానికి , భీమవరం పట్టణానికి నడుమ ఉన్న గ్రామం అత్తిలి లో మహిమానిత శ్రీ సుబ్రమణ్య స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పర్వదినం సంధర్భంగా నేడు, శనివారం ఉదయం స్థానిక తణుకు ఎమ్మెల్యే, బడేటి రాధాకృష్ణ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శించుకొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలు నేపథ్యంలో ప్రతి రోజు వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసంఉత్సవాల ఏర్పట్లపై కమిటీ సభ్యులతో, పోలీస్ అధికారులతో చర్చించడం జరిగింది.
