సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో 15వేల కోట్ల నిధులు సాధించే లక్ష్యంతో ట్రూప్,చార్జీల పేరుతో ఈ నెల నుండి విద్యుత్ బిల్లులలో వేసిన అదనపు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు, మంగళవారం పలు ప్రాంతాలలో సిపిఎం కమిటీ నేతలంతా విద్యుత్ బిల్లుల కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలకు సబ్సిడీ ఇచ్చి, ప్రజలపై భారాలను, స్మార్ట్ మీటర్లను బిగించటాన్ని విరమించు కోవాలని ప్రభుత్వంను కోరారు. సీఎం చంద్రబాబు ఎన్నికలలో .. పన్నులు , చార్జీలు పెంచం .. అన్న హామీలకు కట్టుబడి ఉండాలని కోరారు. గత, పాలకులకు, తమకు తేడా వున్నదని మాటలు కాకుండా, చేతలలోనూ సీఎం చంద్రబాబు నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీల భారం రాబోయే రోజులో ప్రజల నడ్డి విరుస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర, ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందన్నారు. అన్ని ధరలు మరింత పెరుగుతాయని, చిన్న,పరిశ్రమలు మూతపడతాయని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని సిపిఎం నేతలు మండిపడుతున్నారు.
