సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో నేడు, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డు మరియు స్థానిక ఉండి రోడ్డులో ఉన్నటువంటి పలు హోటల్స్ ను మునిసిపల్ కమిషనర్, కె రామచంద్ర రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు స్థానిక అజంత హోటల్ మరియు అరుణ్ టిపిన్ సెంటర్ ల యాజమాన్యాలకు అపరిశుభ్రత ఫై ఆహార పదార్ధాల నాణ్యత ఫై తన అసంతృపి వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఈ తనిఖీ లలో భాగంగా ఉండి రోడ్డులోని విజయ మెస్ వారు వ్యర్ధాలను డ్రైనేజీలో పడవేవడం మరియు పాడైపోయిన ఫ్రిడ్జ్ లో ఆహార పదార్ధాలు నిల్వవుండడం మరియు పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా చేయకపోవడం ఆహార రంగు పదార్థాలతో తాయారు చెసి ప్రజల అనారోగ్యమునకు హాని కలిగిస్తున్నారు అని గమనించిన కమిషనర్ హోటల్ కు అపరాధ రుసుము విధించి తాత్కాలికంగా మూసి వేయాలని ఉత్తర్వులు జారీ చేసారు. ఈ తనిఖిలలోల కమీషనర్ తో పాటు అసిస్టెంట్ కమీషనర్ వెంకటేశ్వర రావు, MHO dr. చైతన్య మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ రమణ పాల్గొన్నారు.
